పోలీసు విధులు, సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన నేరేడుచర్ల ఎస్‌ఐ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

ముఖ్యమైన పాయింట్స్:పోలీసు విధులు, సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహననేరేడుచర్ల ఎస్‌ఐ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం శుభోదయ డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, అక్టోబర్ 24 పోలీసు అమరవీరుల సంస్మరణ, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు విధులు, నేర పరిశోధన పద్ధతులు, సీసీటీవీ కెమెరాల వినియోగం, ఫింగర్‌ప్రింట్ పరికరాల పనితీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల ఛేదనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.పోలీసు శాఖ ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందని ఎస్‌ఐ గోపాల్ రెడ్డి తెలిపారు....