గోపాతండాలో ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం ప్రతిభావంతులైన యువతీ యువకులకు సత్కారం.. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
ముఖ్యమైన పాయింట్స్:గోపాతండాలో ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానంప్రతిభావంతులైన యువతీ యువకులకు సత్కారం.. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ శుభోదయ డైనమిక్ న్యూస్ | గోపాతండా,, అక్టోబర్ 24 గ్రామ అభివృద్ధి, విద్యాభివృద్ధి, యువత ప్రోత్సాహమే లక్ష్యంగా గోపాతండా ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భూక్యా భిక్క నాయక్, గ్రామ పెద్దలు, ఉద్యోగులు, యువత, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.గ్రామం నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన కొర్ర రాంకోటి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయన సేవలను గుర్తించి శాలువా, మెడల్తో ఘనంగా సన్మానించారు. ఆయన సేవలు...