బంగారు ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య..? హుజూర్‌నగర్‌లో కలకలం.. ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ముఖ్యమైన పాయింట్స్:బంగారు ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య..?హుజూర్‌నగర్‌లో కలకలం.. ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్, అక్టోబర్ 22 హుజూర్‌నగర్ పట్టణంలో వృద్ధురాలి దారుణ హత్య కలకలం రేపింది. పోలీస్‌స్టేషన్ వెనుక బజార్‌లోని 6వ వార్డు పరిధి సుందరయ్య నగర్ కాలనీకి చెందిన మామిడి రాములమ్మ (74) హత్యకు గురయ్యారు.వృద్ధురాలి బంగారు ఆభరణాల కోసమే ఈ హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ చలికంటి నరేష్, పోలీసు సిబ్బందితో కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన...