ఎస్పీ కామళ్ల రాంకుమార్‌కు ఘన సన్మానం

ముఖ్యమైన పాయింట్స్:ఎస్పీ కామళ్ల రాంకుమార్‌కు ఘన సన్మానం నడిగూడెం, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 18 నరసింహులగూడెం గ్రామానికి చెందిన కామళ్ల రాంకుమార్ ఎస్పీగా పదోన్నతి పొందడంతో గ్రామ సర్పంచ్ కొంచెం ఇంద్రా నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులను కూడా శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో మునగాల సీఐ కె. ప్రతాప్ లింగం, ఎస్‌ఐ ఎం. సంజీవరెడ్డి, స్వామి వివేకానంద యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.