హైదరాబాద్‌లో విషాదం! డాండియా వేడుకల్లో కూలిన లైటింగ్‌ ఫ్రేమ్‌ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి.. 15 మందికి గాయాలు

ముఖ్యమైన పాయింట్స్:హైదరాబాద్‌లో విషాదం!డాండియా వేడుకల్లో కూలిన లైటింగ్‌ ఫ్రేమ్‌ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి.. 15 మందికి గాయాలు హైదరాబాద్, అక్టోబర్ 18 (శుభోదయ డైనమిక్ వార్త): హైదరాబాద్‌లోని నాదర్‌గుల్ ప్రాంతంలో ఉన్న ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన డాండియా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన లైటింగ్‌ ఫ్రేమ్‌ గాలికి కూలడంతో సోనా అనే 18 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. మరో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు.వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.