నామినేషన్ కేంద్రాల్లో నిఘా కట్టుదిట్టం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్
ముఖ్యమైన పాయింట్స్:నామినేషన్ కేంద్రాల్లో నిఘా కట్టుదిట్టంనిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయవాడ, అక్టోబర్ 18, శుభోదయ డైనమిక్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో నిరంతర సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ లేదా బదిలీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులతో పాటు ముగ్గురు సహాయకులకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.