ఖాతాదారులకు బ్యాంకు సేవలపై అవగాహన హుజూర్‌నగర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మార్కెటింగ్ డే
ముఖ్యమైన పాయింట్స్:ఖాతాదారులకు బ్యాంకు సేవలపై అవగాహనహుజూర్‌నగర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మార్కెటింగ్ డే హుజూర్‌నగర్, అక్టోబర్ 16 (శుభోదయ డైనమిక్ న్యూస్): తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హుజూర్‌నగర్ శాఖ ఆధ్వర్యంలో గురువారం మార్కెటింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వివిధ రకాల రుణ సదుపాయాలపై ఖాతాదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.సీనియర్ సిటిజన్ల కోసం 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకంపై 7.9 శాతం, 1,000 రోజుల డిపాజిట్ పథకంపై 8 శాతం వడ్డీ అందిస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని పొదుపుపై మంచి రాబడి పొందాలని సూచించారు.అలాగే వాహన రుణాలు, వాణిజ్య వాహన రుణాలు,...