రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి మఠంపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ధర్నా
ముఖ్యమైన పాయింట్స్:రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలిమఠంపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ధర్నా నెల రోజులపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తే పంటలు చేతికొస్తాయి: డాక్టర్ పిల్లుట్ల రఘు మఠంపల్లి, అక్టోబర్ 9 (శుభోదయ డైనమిక్ న్యూస్): హుజూర్‌నగర్ నియోజకవర్గంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే నిరంతర విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో మఠంపల్లి మండలంలో శుక్రవారం భారీ నిరసన చేపట్టారు. రైతులతో కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు,...