ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల ప్రదానం శ్రీవాణి పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి

ముఖ్యమైన పాయింట్స్:ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల ప్రదానంశ్రీవాణి పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలువిద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ న్యూస్, అక్టోబర్ 9 ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆయన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ కొణతం సీతారాంరెడ్డి, యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ట్రెజరర్...