పోలీస్‌ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ రేపు గ్రీన్‌వుడ్‌ స్కూల్‌లో పరీక్ష.. ఏర్పాట్లను పరిశీలించిన సీఐ చరమంద రాజు

శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్‌, అక్టోబర్ 3 పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు 45 రోజులపాటు ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించనున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఏర్పాట్లను హుజూర్‌నగర్‌ సీఐ చరమంద రాజు శనివారం పరిశీలించారు. ఆదివారం హుజూర్‌నగర్‌ పట్టణంలోని గ్రీన్‌వుడ్‌ స్కూల్‌లో పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్రంలోని ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 45 రోజులపాటు ఉచిత శిక్షణ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేసి 45 రోజులపాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు సీఐ తెలిపారు. రాత పరీక్షతోపాటు శారీరక సామర్థ్య పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వసతి, భోజనం కూడా ఉచితం శిక్షణకు...