సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి అనారోగ్య బాధితులకు రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం

నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 1 నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. దాచారం శ్రీరాం నగర్‌కు చెందిన అలుగుబెల్లి సావిత్రమ్మ, కొండేటి మాధవరెడ్డికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.60 వేల చొప్పున మంజూరైన చెక్కులను అందించారు. పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ ఈ సందర్భంగా చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక...