దాచారంలో చింతకుంట్ల భిక్షం రెడ్డి విగ్రహావిష్కరణ గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమానికి నిస్వార్థ సేవలు : చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి

సీనియర్ నాయకుల అనుభవం, సూచనలు పార్టీకి ఎంతో అవసరం నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 30 నేరేడుచర్ల మండలం దాచారం గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ చింతకుంట్ల భిక్షం రెడ్డి విగ్రహాన్ని గ్రామ నడికూడలిలో ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కొణతం చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ.. చింతకుంట్ల భిక్షం రెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, సింగిల్ విండో చైర్మన్‌గా గ్రామ ప్రజలకు, రైతాంగానికి నిస్వార్థ సేవలు అందించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ...