చెత్తతో కంపుకొడుతున్న పెద్ద శంకరంపేట రోగాల భయంతో ప్రజలు.. చెరువు కాలుష్యంతో మత్స్యకారుల ఆవేదన

పెద్ద శంకరంపేట, శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 29 మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో చెత్త సమస్యపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారుల వెంట చెత్తను పేరుకుపోయేలా వదిలేయడంతో దుర్గంధం, ఈగలు, దోమల బెడద పెరిగిందని స్థానికులు వాపోతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రహదారి పక్కనే చెత్త కుప్పలు పంచాయతీ సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గ్రామ శివారులోని రహదారి పక్కన వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతులు, మహిళలు అదే మార్గంలో ప్రయాణించాల్సి వస్తోందని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిన చెత్త కారణంగా దుర్గంధం...