తాడ్వాయిలో స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సులభంగా పొందేందుకు ఉపయోగకరం
మునగాల, సెప్టెంబర్ 25,శుభోదయం డైనమిక్ వార్త సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ సేవలను మరింత సులభంగా అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. 867 స్మార్ట్ కార్డులు జారీ తాడ్వాయి గ్రామంలో మొత్తం 867 స్మార్ట్ కార్డులు జారీ చేసినట్లు డీలర్ లక్ష్మీ తెలిపారు. కార్డుల ద్వారా ప్రభుత్వం అందించే వివిధ సేవలను ప్రజలు సులభంగా పొందవచ్చని కార్యక్రమంలో వివరించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల హాజరు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొలిశెట్టి రాంబాయమ్మ,...