భారీ వర్షాల హెచ్చరిక.. నేడు పాఠశాలలకు సెలవు

సూర్యాపేట బ్యూరో , సెప్టెంబర్ 24, శుభోదయ డైనమిక్ వార్త అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సూర్యాపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా నిర్ణయం వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. స్థానిక యంత్రాంగం చేసే సూచనలు, హెచ్చరికలను...