గాంధీ విగ్రహంపై ఫ్లెక్సీలు.. ప్రచార పిచ్చికి పరాకాష్ట!జాతిపిత విగ్రహానికే గౌరవం లేదా? న్యాయవాది చిట్టిపోతుల రమేష్ తీరుపై స్థానికుల ఆగ్రహం
హుజూర్‌నగర్, సెప్టెంబర్ 23,శుభోదయ డైనమిక్ వార్త గాంధీ విగ్రహాన్ని ప్రచార వేదికగా మార్చడంపై తీవ్ర అభ్యంతరాలు.. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ హుజూర్‌నగర్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహంపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారానికి ఉపయోగించడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించి, వ్యక్తిగత ప్రచారానికి వినియోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గాంధీ విగ్రహంపై వ్యక్తిగత ప్రచారమా? న్యాయవాది చిట్టిపోతుల రమేష్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గాంధీ విగ్రహంపై కనిపించడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నాయకుల విగ్రహాలను ప్రచార సామగ్రితో కప్పివేయడం గౌరవప్రదమైన చర్య కాదని పలువురు పేర్కొంటున్నారు. న్యాయవాద...