ఉప ఎన్నిక తప్పదని తేలింది.. సీఎం పగటి కలలు కన్నారు 22ఏ భూముల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ భూములపై సర్వేలు కేటీఆర్ సవాల్‌ను స్వీకరించి సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి కాంగ్రెస్‌ది డైవర్షన్ పాలిటిక్స్‌.. ఒంటెద్దు నర్సింహారెడ్డి

నేరేడుచర్ల, సెప్టెంబర్ 19 శుభోదయ డైనమిక్ వార్త ఉప ఎన్నిక రాదని సీఎం రేవంత్‌రెడ్డి పగటి కలలు కన్నారని, ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైందని హుజూర్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. నేరేడుచర్లలో బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు అరిబండి సురేష్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 22ఏ భూముల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే సర్వేలు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న 22ఏ భూముల సమస్యను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ భూములపై సర్వేలు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఒంటెద్దు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయాలన్నీ కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చుట్టూనే సాగుతున్నాయని విమర్శించారు. కేటీఆర్ సవాల్‌ను...