చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్య ఖూనీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై కోదాడలో బీఆర్ఎస్ మెరుపు రాస్తారోకో
కోదాడ, శుభోదయం డైనమిక్ వార్త, సెప్టెంబర్ 7 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను నిరసిస్తూ కోదాడ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు మెరుపు రాస్తారోకో నిర్వహించారు. కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీని ‘కౌరవ సభ’గా మార్చారు ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ‘కౌరవ సభ’గా మార్చిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను సభకు రాకుండా...