కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రజలకు సమాధానం చెప్పాలి.. బీఆర్‌ఎస్‌ డిమాండ్‌

నడిగూడెం, శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 7 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచనలతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నడిగూడెం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతి నడిగూడెం మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు, వివిధ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై బీఆర్‌ఎస్‌ నాయకులు ఎంపీడీవోకు దరఖాస్తు అందజేశారు. హామీల అమలులో...