మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలు నేరేడుచర్ల పీహెచ్‌సీ వైద్య బృందం సేవలకు అభినందనలు
నేరేడుచర్ల, సెప్టెంబర్ 7,శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలను విజయవంతంగా నిర్వహించి వైద్య సిబ్బంది తమ సేవా నిబద్ధతను చాటుకున్నారు. తల్లులు, శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య బృందం తెలిపింది. డా. పున్న నాగిని ఆధ్వర్యంలో వైద్య సేవలు పీహెచ్‌సీ వైద్యాధికారి డా. పున్న నాగిని ఆధ్వర్యంలో నర్సింగ్, ఇతర సిబ్బంది సమన్వయంతో ప్రసవ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించారు. గర్భిణులకు సకాలంలో అవసరమైన వైద్య సేవలు అందిస్తూ సురక్షితమైన సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్య బృందం సమర్థవంతంగా పనిచేసింది. నర్సింగ్, ఆశా సిబ్బంది సహకారం ఈ రెండు ప్రసవాల నిర్వహణలో నర్సింగ్ ఆఫీసర్లు...