ముత్యాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం దర్శనం కోసం భారీ క్యూ లైన్లు.. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి
శుభోదయ డైనమిక్ వార్త – హుజూర్‌నగర్, సెప్టెంబర్ 6 సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో అమ్మలగల అమ్మ, ముగ్గురమ్మల ముత్యాలమ్మ తల్లి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. జాతరకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంగా మారాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం కోసం భారీ క్యూ లైన్లు అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు భారీగా క్యూ లైన్లలో బారులు తీరారు. సమయం గడిచేకొద్దీ రద్దీ మరింత పెరగడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల...