రూ.15 కోట్ల నిధులతో అభివృద్ధి పనుల పరిశీలన
నేరేడుచర్ల, సెప్టెంబర్ 6,శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల పురపాలక సంఘం పరిధిలో రూ.15 కోట్ల నిధులతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను పురపాలక సంఘం చైర్మన్ కొణతం వెంకటరెడ్డి, కమిషనర్ చెన్నబోయిన నాగరాజు పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా పురపాలక సంఘం పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన చైర్మన్, కమిషనర్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలి అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులను పర్యవేక్షిస్తున్నట్లు...