అనుమతులు లేకుండానే చెరువులో మట్టి దందా.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
పాలకవీడు,శుభోదయ డైనమిక్ వార్త, ఆగస్టు 27 పాలకవీడు మండల పరిధిలోని జాన్‌పహాడ్ చెరువు తండా ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని చెరువులో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో చెరువు మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.మట్టి తరలింపు వ్యవహారంపై సంబంధిత ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా, తమకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని, విషయం తెలిసిన వెంటనే మట్టి తరలింపును నిలిపివేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అయితే అధికారులు స్పందించేలోపే పెద్ద మొత్తంలో మట్టి తరలిపోయిందన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అనుమతులతో మట్టి తరలింపు? ప్రభుత్వ ఆధీనంలోని చెరువులో భారీగా మట్టి...