మోతే మండలంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సుడిగాలి పర్యటన పలువురి కుటుంబాలను పరామర్శించి.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా
శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే | ఆగస్టు 25 మోతే మండలంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి సోమవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు గ్రామాల్లో పర్యటిస్తూ ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. హుస్సేనాబాద్ గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ కొమ్ము ఎలమంచమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.సిరికొండ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన షేక్ సలీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బిఖ్య తండాకు చెందిన జంట హత్యల్లో మృతి చెందిన హలావత్ నాగులు, బూబా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధరావత్ రవీందర్ కుమార్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడికి...