నార్కోటిక్ డాగ్‌ ‘రోలెక్స్‌’తో ముమ్మర తనిఖీలుహైవే దాబాలు, హోటళ్లు, పాఠశాలల ప్రాంగణాల్లో సోదాలు యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలపై ఉక్కుపాదం: ఎస్‌ఐ లచ్చిరెడ్డి

శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే, ఆగస్టు 17 మోతే మండల పరిధిలో డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మోతే పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది నార్కోటిక్‌ డాగ్‌ ‘రోలెక్స్‌’ సహాయంతో మండలంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.జాతీయ రహదారి వెంట ఉన్న దాబాలు, హోటళ్లు, కిరాణా దుకాణాలు, మెడికల్‌ షాపులతో పాటు పలు పాఠశాలల ప్రాంగణాలను డాగ్‌ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు, నిల్వలు ఎక్కడైనా జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు నిశితంగా పరిశీలించారు. మత్తు పదార్థాల విక్రయదారులపై కఠిన చర్యలు ఈ సందర్భంగా ఎస్‌ఐ...