ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు బీసీ నిరుద్యోగ మహిళలకు అవకాశం.. సెప్టెంబర్‌ 15లోగా దరఖాస్తులు

నేరేడుచర్ల, ఆగస్టు 14,శుభోదయ డైనమిక్ వార్త బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు’ పథకానికి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని నేరేడుచర్ల ఏపీఎం శ్రీనివాస్ సూచించారు. 18 నుంచి 55 ఏళ్ల మహిళలు అర్హులు తెలంగాణలోని బీసీ వర్గాలకు చెందిన 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ మహిళలు ఈ పథకానికి అర్హులని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు. వీరికి ప్రాధాన్యం వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, దివ్యాంగులు, అలాగే ఇప్పటికే కుట్టు వృత్తిలో...