చెరువును తలపిస్తున్న లింగగిరి గ్రామం! చిన్న వర్షానికే బురదమయంగా మారుతున్న ప్రధాన రహదారి మట్టి పోసి సమస్యను మరింత జటిలం చేశారంటున్న గ్రామస్తులు అత్యవసర వేళల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్,ఆగస్టు 14 సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని లింగగిరి గ్రామంలో చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారి బురదమయంగా మారి చెరువును తలపిస్తోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో అడపాదడపా కురుస్తున్న వర్షాలకే రహదారిపై భారీగా నీరు, బురద నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో ఈ మార్గం ఆర్‌అండ్‌బీ రహదారిగా ఉండగా, వర్షాల సమయంలో అక్కడక్కడ మాత్రమే నీరు నిలిచేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇటీవల రహదారిపై అధికారులు సరైన ప్రణాళిక లేకుండా మట్టిని పోయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారి మట్టి, నీరు కలిసి రహదారి మొత్తం బురదమయంగా మారుతోంది.దీంతో...