రక్షించాల్సిన పోలీసులే భక్షకులవుతున్నారా? మోతెలో హత్య కలకలం.. స్థానిక కానిస్టేబుల్‌పై అనుమానాలు?

మోతె, ఆగస్టు 14 శుభోదయ డైనమిక్ వార్త ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తే పోలీసు శాఖ ప్రతిష్ఠకే మచ్చగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతె మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ, రెవెన్యూ పరిధిలో NH-365 హైవే పక్కన హత్య చేసి, ఆనవాళ్లు కనిపించకుండా మృతదేహాలను మట్టిలో పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపుతోంది.ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై ప్రధాన అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలు, అనుమానాలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటన వెనుక అసలు కారణాలు, ఇందులో ఎవరి పాత్ర ఉందనే విషయాలను పోలీసులు...