ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే సహించం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటాం: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యకలెక్టర్, ఎస్పీల పనితీరుపై ప్రశంసలు
శుభోదయ డైనమిక్ వార్త , సూర్యాపేట బ్యూరో , ఆగస్టు 13 ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడటంతో పాటు, వారి సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు, సంక్షేమ పథకాలపై సమీక్ష...