మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష రూ.7 వేల జరిమానా.. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
నల్గొండ బ్యూరో , ఆగస్టు 13,శుభోదయ డైనమిక్ వార్త మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు రూ.7 వేల జరిమానా చెల్లించాలని, బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. మిర్యాలగూడలో 2020లో ఘటన 2020లో మిర్యాలగూడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై క్రైమ్ నంబర్ 97/2020, SC No.198/2020గా కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ జాఖీర్...