కేజీబీవీలో విద్యార్థినితో అనుచిత ప్రవర్తన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

మోతె, ఆగస్టు 7 ,శుభోదయ డైనమిక్ వార్త మోతె మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఓ యువకుడు విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పాఠశాల ఆవరణలోకి ప్రవేశించిన యువకుడు పోలీసుల వివరాల ప్రకారం, ఓ యువకుడు రాత్రి సమయంలో కేజీబీవీ పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి ఓ విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. విద్యార్థిని అప్రమత్తమై సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అప్పగింత.. కేసు నమోదు...