నాగార్జునసాగర్‌లో ఆగస్టు 10న మహా వరుణ యాగం సీఎం రేవంత్ రెడ్డి హాజరు.. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు
హైదరాబాద్ , శుభోదయ డైనమిక్ డెస్క్, ఆగస్టు 7 రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా–గోదావరి నదులు జలకళతో కళకళలాడాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగాన్ని నిర్వహించనుంది. ఆగస్టు 10న సోమవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున ఉన్న విజయ విహార్ ఆవరణలో ఈ యాగం వైభవంగా జరగనుంది. యాగంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో యాగం.. ముమ్మర ఏర్పాట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహా వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. దేవస్థాన పాలక మండలి ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ యాగాన్ని నిర్వహించడం విశేషంగా మారింది....