ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి: ఎస్పీ నరసింహ

సూర్యాపేట బ్యూరో , ఆగస్టు 6,శుభోదయ డైనమిక్ వార్త తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తిప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల్లో చైతన్యం నింపడంతో పాటు ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత బలం అందించిన మహనీయుడు...