డయల్-100 కాల్‌కు వెంటనే స్పందించి ఉరివేసుకున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన చండూరు హెడ్ కానిస్టేబుల్

నల్లగొండ బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త, ఆగస్టు 3 డయల్-100 సమాచారం అందగానే ఐదు నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చండూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి ప్రదర్శించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఉడతలపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోందని డయల్-100కు సమాచారం అందడంతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ వెంటనే స్పందించి కేవలం ఐదు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మెయిన్ డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి సీపీఆర్ అందించిన హెడ్ కానిస్టేబుల్ ఘటన స్థలానికి చేరుకున్న అనంతరం పరిశీలించగా, ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాపాయ...