రాఘవపురం ఎక్స్‌రోడ్ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహణ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కారింగుల లింగమూర్తి గౌడ్ ఎన్నిక కాంగ్రెస్ కార్యకర్తల ఏకగ్రీవ ఆమోదంతో నూతన కమిటీ ఏర్పాటు
శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే | ఆగస్టు 2 మోతే మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కోల లింగయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.ఎస్. ఫంక్షన్ హాల్లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎన్నికలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఏకగ్రీవ ఆమోదంతో గ్రామ శాఖ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ బాధ్యతలు స్వీకరణ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కారింగుల లింగమూర్తి గౌడ్, ఉపాధ్యక్షుడిగా బత్తిని రవి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కోల కృష్ణ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బట్టిపెళ్లి సతీష్ గౌడ్, కోశాధికారిగా బొడ్డు గురవయ్య గౌడ్, ప్రచార కార్యదర్శిగా తాటికొండ సోమిరెడ్డి ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులు, సహాయ...