నేరేడుచర్ల మండలంలో ట్రాన్స్‌ఫార్మర్లే టార్గెట్..! వరుస దొంగతనాలతో రైతుల్లో ఆందోళన – బోరు సాగుకు తీవ్ర ముప్పు

నేరేడుచర్ల, జూలై 25,శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల మండలంలో వరుసగా జరుగుతున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, విద్యుత్ వైర్ల దొంగతనాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా బోర్ల ఆధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ దొంగతనాలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే సాగులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఇప్పుడు దొంగల బెడద మరో కొత్త కష్టంగా మారింది. చిల్లేపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసిన దుండగులు నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలోని ఉప్పల్‌కుంట ప్రాంతంలో ఉన్న 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, అందులోని లెగ్ వైర్లు, ఇతర విలువైన పరికరాలను...