చిల్లేపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌కు కన్నం.. ఆయిల్, కోర్ చోరీ గాంధీనగర్ సిటీ సెంటర్ స్కూల్ సమీపంలో ఘటన.. రైతుల్లో ఆందోళన ఇదే నెలలో జనలదిన్నె గ్రామంలోనూ ట్రాన్స్‌ఫార్మర్ చోరీ.. నేరేడుచర్ల మండలంలో పెరుగుతున్న వరుస ఘటనలు

నేరేడుచర్ల, జూలై 18,శుభోదయ డైనమిక్ వార్త సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ సిటీ సెంటర్ స్కూల్ సమీపంలో ఉన్న 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు లక్ష్యంగా చేసుకుని భారీ చోరీకి పాల్పడ్డారు. రాత్రి వేళ ట్రాన్స్‌ఫార్మర్‌లోని ఆయిల్‌తో పాటు లోపల ఉన్న విలువైన కోర్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో పరిసర ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులకు షాక్ శనివారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు చేరుకుని చూడగా, ట్రాన్స్‌ఫార్మర్ డబ్బా మాత్రమే ఉండి, అందులోని ఆయిల్, కోర్ పూర్తిగా చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు...