మట్టపల్లి అభివృద్ధికి రూ.13 కోట్లు..!లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో పర్యాటక సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

శుభోదయ డైనమిక్ వార్త , మఠంపల్లి, జులై 17 హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పరిసర ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు మంజూరు చేస్తూ గురువారం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో ఆధునిక పర్యాటక వసతులు, బోటింగ్ సౌకర్యాలు, మౌలిక సదుపాయాల విస్తరణ చేపట్టనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తితో నిధుల మంజూరు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) అధికారులు మట్టపల్లి క్షేత్రాన్ని పరిశీలించి రూ.13 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి...