నేరేడుచర్ల నూతన ఎస్‌ఐగా సీహెచ్. గోపాల్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కోదాడ రూరల్ నుంచి బదిలీపై నేరేడుచర్లకు రాక ఎస్‌ఐ సైదిరెడ్డి ఎస్పీ కార్యాలయానికి బదిలీ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలే లక్ష్యమని నూతన ఎస్‌ఐ

నేరేడుచర్ల, జూలై 10, శుభోధయ డైనమిక్ వార్త నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా సీహెచ్. గోపాల్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా నేరేడుచర్లకు నియమితులై బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది నూతన ఎస్‌ఐకి స్వాగతం పలికారు. ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ విధులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.ఇదిలా ఉండగా, నేరేడుచర్లలో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన సైదిరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం (ఎస్‌పీ ఆఫీస్)కు బదిలీ అయినట్లు...