నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా పూసం నీరజ

నేరేడుచర్ల, జూలై 6,శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా పూసం నీరజ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా, ఎఫ్‌ఏసీ (FAC) ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించిన ఆమె ఇటీవల పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఇంచార్జి ప్రిన్సిపల్ పి. వెంకటరమణ నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఘనంగా సన్మానం నూతన ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన పూసం నీరజను రాష్ట్ర జీజేఎల్‌ఏ (GJLA) అధ్యక్షులు, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రిన్సిపల్స్ సంఘం గౌరవాధ్యక్షులు కేఎస్ రామారావు, సంఘ నాయకులు శేషుబాబు, పి. శంకర్,...