యూరియా పేరుతో రైతులపై దోపిడీ..?
గౌరీ శంకర్ ఫర్టిలైజర్స్‌పై తీవ్ర ఆరోపణలు? ప్రభుత్వ ధరకు అదనంగా రవాణా పేరుతో వసూళ్లు చేశారంటున్న రైతులు సిబ్బంది అవమానకరంగా ప్రవర్తించారని ఆవేదన దుకాణంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి.... నేరేడుచర్ల, జూన్ 26,శుభోదయ డైనమిక్ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలోని బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన పర్శన బోయిన సైదులు అనే రైతు యూరియా విక్రయాల విషయంలో గౌరీ శంకర్ ఫర్టిలైజర్స్ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా బస్తాకు రూ.266 మాత్రమే చెల్లించాల్సి ఉండగా, ఐదు బస్తాలకు రూ.1,330 ఫోన్‌పే ద్వారా చెల్లించిన తర్వాత కూడా రవాణా ఖర్చు పేరుతో మరో రూ.170 వసూలు చేశారని...