పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ పాఠశాలల్లో బాలికలకు స్వీయ రక్షణ శిక్షణ బ్లాక్ బెల్ట్ మార్షల్ ఆర్ట్స్ మాస్టార్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

సూర్యాపేట బ్యూరో , జూన్ 25,శుభోదయ డైనమిక్ తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ (PMSHRI) పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలికలకు స్వీయ రక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 24 పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ పాఠశాలల బాలికలకు కరాటే, కుంగ్‌ఫూ, జూడో తదితర మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన & క్రీడల అధికారి బి. వెంకట్ రెడ్డి తెలిపారు. మహిళా శిక్షకులకు తొలి ప్రాధాన్యత స్వీయ రక్షణ శిక్షణ అందించేందుకు బ్లాక్ బెల్ట్ అర్హత కలిగిన మార్షల్ ఆర్ట్స్ మాస్టార్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు....