సూర్యాపేటలో ట్రాఫిక్ సిగ్నల్ ప్రారంభం నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలాన్లు తప్పవు : జిల్లా కలెక్టర్ తేజాస్ నందులాల్ పవార్
సూర్యాపేట, జూన్ 24 (శుభోదయ డైనమిక్ న్యూస్) ప్రజలు, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నందులాల్ పవార్ సూచించారు. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆటోమేటిక్‌గా ఈ-చలాన్లు జారీ అవుతాయని హెచ్చరించారు. ఖమ్మం ఎక్స్ రోడ్డు వద్ద సిగ్నల్ ప్రారంభం బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్‌ను జిల్లా కలెక్టర్ తేజాస్ నందులాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధితో కలిసి ప్రారంభించారు. ఏఎన్‌పీఆర్ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెరుగుతున్న వాహనాల...