నీట్ యూజీ-2026 రీ ఎగ్జామినేషన్‌ను పకడ్బందీగా నిర్వహించాలి అధికారులకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాలు అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం – పాత అడ్మిట్ కార్డు చెల్లదు
నల్గొండ బ్యూరో , జూన్ 19,శుభోదయ డైనమిక్ వార్త ఈనెల 21న నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 రీ ఎగ్జామినేషన్ను ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదేశాల మేరకు ఈ పరీక్షను జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు అదనపు సమయం గతంలో నిర్వహించిన నీట్ పరీక్షతో పోలిస్తే ఈసారి అభ్యర్థులకు అదనంగా 15 నిమిషాల సమయం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే...