సూర్యాపేటను సురక్షిత పట్టణంగా తీర్చిదిద్దుతాం: జిల్లా ఎస్పీ నరసింహ సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ
సూర్యాపేట బ్యూరో , జూన్ 19,శుభోదయ డైనమిక్ వార్త జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎస్సైలు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు సిబ్బంది కవాతు, రికార్డుల పరిశీలన అనంతరం సిబ్బంది నిర్వహించిన కవాతును పరిశీలించిన ఎస్పీ, వారి యూనిఫాంలు, కిట్లను తనిఖీ చేశారు. సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణ ఫైళ్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.పెండింగ్‌లో...