ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట బ్యూరో , జూన్ 18, శుభోదయ డైనమిక్ వార్త జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ ప్రతి మండలం నుంచి ఒక ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసి దశలవారీగా మోడల్ స్కూల్‌గా అభివృద్ధి చేయాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలను అవసరాల ఆధారంగా గ్రేడ్‌లుగా విభజించి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు,...