మేకల వెంకటేశ్వర్లు మృతి భాజపాకు తీరని నష్టం: సంకినేని వెంకటేశ్వరరావు గడ్డిపల్లిలో సంతాప కార్యక్రమంలో నివాళులు

గరిడేపల్లి, జూన్ 18,శుభోదయ డైనమిక్ వార్త తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాట యోధుడు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు ఆకస్మిక మృతి భాజపాకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే, భాజపా కేంద్ర నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. పార్టీ అభివృద్ధికి విశేష సేవలు గురువారం గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో మేకల వెంకటేశ్వర్ల నివాసంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అంకితభావం, కృషి, పట్టుదలతో పార్టీ కోసం నిరంతరం పనిచేసిన నాయకుడు మేకల వెంకటేశ్వర్లని కొనియాడారు. పార్టీ ఎదుగుదలకు విశేషంగా శ్రమించారని పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడి అకాల మరణం బాధాకరం గడ్డిపల్లి మాత జాతర...