డ్రగ్స్ నిర్మూలనకు మొక్కలతో సందేశం వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టిన నేరేడుచర్ల పోలీసులు
నేరేడుచర్ల, జూన్ 10 ,శుభోదయ డైనమిక్ వార్త సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారిని నిర్మూలించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ ఈగల్ టీం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతీకగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణల్లో విస్తృతంగా మొక్కలు నాటారు. ప్రభుత్వ హెల్త్ సెంటర్‌లో మొక్కల నాటకం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు నేరేడుచర్ల మండలంలోని ప్రభుత్వ హెల్త్ సెంటర్‌లో స్థానిక వైద్యులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు మరియు ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బందితో కలిసి పోలీసులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కార్యక్రమంలో వివిధ శాఖల...