రేకుల ఇంట్లో నరకయాతన.. ఇందిరమ్మ ఇల్లు కోసం నిరుపేద కుటుంబం వేడుకోలు ముగ్గురు కుమార్తెలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిదానం ప్రశాంత్ కుటుంబం వర్షాకాలంలో నీరు, ఎండాకాలంలో ఉక్కపోత.. పాములు, తేళ్ల భయంతో బిక్కుబిక్కుమంటున్న జీవనం
నేరేడుచర్ల, జూన్ 1,శుభోదయ డైనమిక్ వార్త సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిదానం ప్రశాంత్ కుటుంబం నివాస సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భార్య సుజాత, ముగ్గురు కుమార్తెలతో కలిసి నివసిస్తున్న ఈ కుటుంబం ప్రస్తుతం రేకులతో నిర్మించిన శిథిలావస్థలో ఉన్న ఇంటిలో జీవనం సాగిస్తోంది. కనీస సౌకర్యాలు కూడా లేని ఆ ఇంటిలో ప్రతి రోజు భయంతో, ఆందోళనతో గడుపుతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఉక్కపోత.. వర్షాకాలంలో నీటిమయం ప్రశాంత్ కుటుంబం నివసిస్తున్న రేకుల ఇల్లు ఎండాకాలంలో తీవ్ర ఉక్కపోతకు గురవుతోంది. ఇంటి పైకప్పు వేడిని తట్టుకోలేకపోవడంతో పిల్లలు, పెద్దలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారని...