హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ల మధ్య విభేదాలు లేవు చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ నాయకత్వంలో సమష్టిగా పట్టణ అభివృద్ధికి కృషి అసత్య ప్రచారాలను ఖండించిన 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ

శుభోదయ డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మే 31 హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ల మధ్య ఎలాంటి విభేదాలు, గ్రూపు రాజకీయాలు లేవని, చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ నాయకత్వంలో అందరూ సమన్వయంతో పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నామని 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో మున్సిపల్ కౌన్సిలర్ల మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. అందరం ఒకే కుటుంబంలా పనిచేస్తున్నాం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం వంటి అంశాల్లో కౌన్సిలర్లందరూ ఒకే లక్ష్యంతో ముందుకు...